తమన్నా
‘‘ఆర్టిస్ట్‌ల గురించి ఏదైనా రాసేముందు ఒకటికి రెండుసార్లు ఎందుకు సరి చూసుకోరు?’’ అని మండిపడ్డారు తమన్నా. సెన్సేషన్ కోసం ఏది పడితే అది రాసే ఆర్టికల్స్‌ను చూసి ఆమె ఈ విధంగా స్పందించారు. ‘‘అజ్ఞానమే మహానందం అంటుంటారు. కానీ వీళ్ల (ఎల్లో జర్నలిజమ్) విషయంలో చాలా డిస్ట్రబింగ్‌గా ఉంది. నాకో సందేహం కలుగుతుంటుంది. రాసింది పబ్లిష్ చేసే ముందు వాళ్లు హోమ్‌వర్క్ చేయకుండా ఎలా ఉంటారా? అని. ఆ సమాచారం సరైనదా? కాదా? అని ఆలోచించకుండా ప్రచురించడం సరికాదు.
పబ్లిష్ చేసేముందు సంబంధిత వ్యక్తులను ఒక మాట అడిగితే ఏం పోతుంది? కల్పిత వార్తలు రాసి, సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకోవడం సబబు కాదు. ఈసారి నా గురించి ఏదైనా రాసేముందు కొంచెం రెస్పాన్సిబుల్‌గా నన్ను సంప్రదించి, నా అభిప్రాయం ఏంటో కనుక్కోండి. నేను ఇవ్వని ఇంటర్వ్యూల్ని, అలాగే పాత ఇంటర్వ్యూలోని సమాచారాన్ని సంబంధం లేని చోట వాడకండి. దయచేసి నేను చెప్పని విషయాలను మీరు చెప్పకండి’’ అని ఘాటుగా పేర్కొన్నారు తమన్నా. ఇంతకీ తమన్నా గురించి రాసింది ఎవరు? ఏం రాశారు? అనే ప్రశ్నలకు సమాధానం ఎదురు చూడొద్దు. ఎందుకంటే తమన్నా ఆ విషయాలేవీ ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment