
మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీ అయిపోయింది చిత్రబృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మెగాస్టార్.. తమన్నా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. అదేంటో ఓసారి తెలుసుకుందాం.
(ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి )
చిరంజీవి మాట్లాడుతూ..'భోళా శంకర్‌లో మిల్కీబ్యూటీ అనే సాంగ్ ఉంది. ఇది స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించాం.దాదాపు రెండు వారాలు షూటింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో తమన్నా ఫాదర్‌కు సర్జరీ జరిగిందని విన్నా. ఆ సమయంలో కూడా తమన్నా వెళ్లలేదు. కెమెరా ముందుకు వచ్చి డాన్స్ వేయడం.. అంతలోనే కెమెరా వెనక్కి వెళ్లి ఫోన్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని సూచించింది. తనకి బాధను దిగమింగుకుని డాన్స్ చేస్తుంటే సినిమాపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.' అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సైతం తమన్నాను అభినందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి మహతి స్వర సాగర సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కించారు.
(ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?)
Comments
Please login to add a commentAdd a comment