నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా | Tamanna Bhatia About Her Career And Success in Film Industry | Sakshi
Sakshi News home page

Tamanna: నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా

Jan 4 2023 9:01 AM | Updated on Jan 4 2023 9:10 AM

Tamanna Bhatia About Her Career And Success in Film Industry - Sakshi

తన సినీ ప్రయాణం అందుకే అంత సంతోషంగా ఉందని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై తెలుగు, తమిళంలో అడుగుపెట్టిన ఆమె కెరీర్‌ మొదట్లో ఆశించిన విధంగా సాగలేదు. తెలుగులో తొలి చిత్రం శ్రీ, తమిళంలో నటించిన మొదటి చిత్రం కేడీ నిరాశపరిచాయి. ఆ తర్వాత తెలుగులో హ్యాపీ డేస్, కోలీవుడ్‌లో  కల్లూరి చిత్రాలు తమన్నా సక్సెస్‌కు బాటలు వేశాయి. ఆ తర్వాత ఈ అమ్మడు అంచెలంచెలుగా ఎదిగి టాప్‌ హీరోయిన్లు ఒకరుగా రాణించారు. అయితే ఈ బ్యూటీ గ్లామర్‌నే నమ్ముకుంది. అదే వర్కౌట్‌ అయ్యింది. ఆ తర్వాతనే నటిగా నిరూపించుకునే అవకాశాలు రావడం మొదలెట్టాయి.

ముఖ్యంగా బాహుబలి, సైరా వంటి చిత్రాల్లో తమన్నా తన నటనా సత్తాను చాటుకునే అవకాశం కలిగింది. అయితే ప్రస్తుతం అంత క్రేజ్‌ లేకపోయినా అవకాశాలు మాత్రం వరిస్తూనే ఉన్నాయి. 2022లో ఈ అమ్మడు నటించిన బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి అనే రెండు హిందీ చిత్రాలు, ఎఫ్‌ 3, గుర్తుందా సీతాకాలం అనే  రెండు తెలుగు చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా తమన్నా తన సినీ ప్రయాణం గురించి ఒక భేటీలో పేర్కొంటూ ఏ రంగంలోనైనా మనం అనుకున్నది వెంటనే జరిగిపోదని, ఆ టైం వచ్చే వరకు ఎదురు చూడాలని పేర్కొంది. తనకు కూడా ప్రారంభ దశలో ఆశించిన అవకాశాలు లభించలేదని చెప్పింది. అయితే వచ్చిన అవకాశాలతోనే తన ప్రతిభను చాటుకునే దిశగా ప్రయత్నించానని చెప్పింది.

అలా సక్సెస్‌ అందుకున్నానని చెప్పింది. తాను ఏం కావాలని భావించానో దాన్ని సాధించానంది. ఇప్పుడు తన సినీ పయనం చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని పేర్కొంది. అయితే ఈ అమ్మడు అంతకు ముందు సినీ రంగంలో మహిళలకు మర్యాదే లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. తను మాటలను పట్టించుకోరని, హీరోల కంటే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువేనని చెప్పింది. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోతే ఏవేవో కారణాలు చెబుతారని అదే హీరోయిన్లు అయితే విమర్శలు గుప్పిస్తారని పేర్కొంది. ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం విజయవర్మ అనే బాలీవుడ్‌ నటుడితో ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది.

చదవండి: 
దళపతి విజయ్‌పై శ్రీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
స్టేజ్‌పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్‌, వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement