Prabhas Playing Chess With Tamannaah, Video Viral - Sakshi
Sakshi News home page

Prabhas-Tamanna: తమన్నాకు చెస్‌ ఆట నేర్పిస్తున్న ప్రభాస్‌, వైరల్‌గా త్రోబ్యాక్‌ వీడియో

Published Thu, Nov 3 2022 10:08 AM | Last Updated on Thu, Nov 3 2022 11:30 AM

Prabhas, Tamanna Playing Chess at Rebel Movie Old Video Goes Viral - Sakshi

‘డార్లింగ్‌’ ప్రభాస్‌ చేతిలో భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాల షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యుల్‌లో కూడా తిరిగ్గా ‘మిల్కీ బ్యూటీ’ తమన్నాతో కలిసి ప్రభాస్‌ చెస్‌ ఆడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఎంటాని ఆరా తీస్తున్నారు. 

చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’

మరోవైపు తమన్నా కూడా భోళా శంకర్‌ సినిమాతో పాటు ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి చెస్‌ ఆడటమేంటని అంతా షాక్‌ అవుతున్నారు. అయితే అది ఇప్పటి వీడియో కాదు. ప్రభాస్‌-తమన్నా జంటగా రెబల్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో వీరిద్దరు సరదాగా చదరంగా ఆడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్‌ చదరంగంలో ఎత్తులు ఎలా వేయాలో తమన్నాకు వివరిస్తూ కనిపించాడు.

చదవండి: ‘గాడ్‌ ఫాదర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

అంతేకాదు తన ఆటతో పాటు తమన్నా ఆటను కూడా తానే ఆడుతూ ఆమెకు చెస్‌ నేర్పిస్తున్న ఈ వీడియో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ ప్యాన్‌ ఒకరు  బిహైండ్ ది సీన్స్ అంటూ ఈ త్రోబ్యాక్‌ వీడియోను షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2012ay లారెన్స్‌ దర్శకత్వంలో ప్రభాస్‌-తమన్నా హీరోహీరోయిన్లుగా రెబల్‌ మూవీ తెరకెక్కింది. ఇందులో దివంగత నటుడు, ప్రభాస్‌ పెద్దనాన్న కృష్ణం రాజు ప్రధాన పాత్ర పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement