chess game
-
స్ఫూర్తిదాయక విజయాలు
చదరంగంలో భారత దేశానికి ఇది స్వర్ణయుగం. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఫిడే’ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత క్రీడాకారిణి కోనేరు హంపీ ఆదివారం సాధించిన ఘన విజయం అందుకు మరో తాజా నిదర్శనం. న్యూయార్క్‌లో మొత్తం 110 మంది పాల్గొన్న ర్యాపిడ్ చెస్ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, ఛాంపియన్ అయ్యారు. అంతకు ముందు సింగపూర్‌లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ విజయం, అంతకన్నా ముందు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బుడాపెస్ట్‌లోని చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, ఉమెన్స్ కేటగిరీలు రెంటిలోనూ కనివిని ఎరు గని రీతిలో భారత్ రెండు స్వర్ణాలు సాధించడం... ఇవన్నీ ఈ 2024ను భారత చదరంగానికి చిరస్మరణీయ వత్సరంగా నిలిపాయి. మంగళవారం నుంచి జరగనున్న ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపి యన్షిప్ పైనా కన్నేసి, గ్రాండ్డబుల్ సాధించాలని హంపీ అడుగులేస్తుండడం విశేషం. గతంలో 2019లో జార్జియాలో తొలిసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన కోనేరు హంపీకి తాజా విజయం రెండో ప్రపంచ టైటిల్. చైనాకు చెందిన జూ వెన్జున్ తర్వాత ఈ టైటిల్‌ను ఒకటికి రెండుసార్లు గెలిచింది హంపీయే! నిరుడు పెళ్ళి తరువాత మాతృత్వం కోసం కొన్నాళ్ళు ఆటకు దూరం జరిగిన హంపీ 2018లో చదరంగపు పోటీలకు తిరిగి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. 2019లో టైటిల్ సాధించారు. గత ఏడాది కూడా ఆమె గెలవాల్సింది. టై బ్రేక్‌లో త్రుటిలో ప్రపంచ టైటిల్‌ను కోల్పోయారు. అయితేనేం, పట్టుదలతో కృషిని కొనసాగించి మళ్ళీ ఇప్పుడు ఆటలో కిరీటం గెల్చుకొని, తనలో సత్తా చెక్కుచెదరలేదని నిరూపించారు. సామాన్యులతో పాటు ఆటలోని వర్ధిష్ణువులకు సైతం ఇది స్ఫూర్తి మంత్రం. నిజానికి, ఈ భారత నంబర్ 1 చదరంగ క్రీడాకారిణే అన్నట్టు, కచ్చితంగా సరికొత్త టైటిల్ విజయం మన దేశంలోని యువతరాన్ని చదరంగ క్రీడ వైపు మరింతగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో పలువురు చెస్ ప్రొఫెషనల్స్‌గా తయారవడానికి ప్రేరణ కూడా అవుతుంది. ఫస్ట్ రౌండ్లో ఓటమి పాలైనా, 11వ, ఆఖరి రౌండ్లో గెలవడంతో 8.5 పాయింట్లతో పట్టికలో హంపీ అగ్రస్థానానికి చేరారు. ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందర్‌ను ఓడించి, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపుతో 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. చెస్‌లో ఆరితేరిన గ్రాండ్ మాస్టర్ అయినా బిడ్డకు తల్లి అయ్యాక, ఎన్నో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, 37 ఏళ్ళ వయసులో హంపీ ఈ అరుదైన విన్యాసం సాధించడం అబ్బురం. అంతేకాదు... అభినందించాల్సిన అంశం. వయసు, బాధ్యతలు మీద పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా, నిత్య కృషితో ముందుకు సాగడం, ఆటలో అదే నైశిత్యాన్ని ప్రదర్శించడం ఆషామాషీ కాదు. ఈ 2024 అంతా ఆశించిన ఆటతీరు కనబరచలేక, ఆత్మవిశ్వాసం కుంటుబడిన హంపీ ఒక దశలో అసలీ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడకూడదనీ అనుకున్నారట. ఆట నుంచి రిటైరవుతారన్న అనుమానాల నుంచి ఆఖరికి అగ్రపీఠాన్ని అధిష్ఠించే దాకా ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. అందుకే, హంపీ గెలిచిన ఈ కొత్త కిరీటం మునుపటి విజయాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారి కూతురును చూసుకోవడంలో ఆమె తల్లితండ్రులు, భర్త పోషించిన పాత్ర మరెందరికో స్ఫూర్తిపాత్రమైనది. అంతర్జాయ యవనికపై భారత క్రీడాకారులు, అందులోనూ తెలుగువాళ్ళు కొన్నాళ్ళుగా సాధి స్తున్న ఘనతలు అనేకం. తాజా ఘటనలే తీసుకుంటే, తెలుగు మూలాలున్న చెన్నై కుర్రాడు గుకేశ్ ఇటీవల ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకన్నా ముందు ఆ వెంటనే ఇప్పుడు హంపీ ర్యాపిడ్ చెస్‌లో రెండోసారి వరల్డ్ టైటిల్ సాధించారు. మరోపక్క భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన 22 ఏళ్ళ నవ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో సంచలనం రేపాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 4వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి, అద్భుత మైన తొలి శతకం సాధించి, జట్టు పరువు నిలిపాడు. విదేశీగడ్డపై తొలి టెస్ట్ సిరీస్ ఆడుతూ, 8వ నంబర్ ఆటగాడిగా బరిలో దిగి సెంచరీ చేసిన తీరు యువతరంలోని క్రీడాకౌశలానికి నిదర్శనం. ఇవన్నీ భారత జాతి, మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళు గర్వించాల్సిన క్షణాలు. అయితే, ఇవి సరి పోవు. మన 140 కోట్ల జనాభాలో ఇంతకు మించి శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారినీ సరైన రీతిలో ప్రోత్సహించి, ప్రాథమిక వసతి సౌకర్యాలు అందిస్తే ఇలాంటి విజయాలు అనునిత్యం మన సొంతమవుతాయి. తాజా ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా క్రీడల్లో కెరీర్‌ను నిర్మించుకోవడం ఇప్పటికీ కష్టసాధ్యంగానే ఉందన్నది నిష్ఠురసత్యం. ఆటల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న పలువురు ఆనక కూలీనాలీ చేసుకుంటూ, కష్టంగా బతుకీడుస్తున్న ఉదంతాలు నేటికీ కళ్ళ ముందుకొస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది, క్రీడల మీద ఆసక్తిని పెంచాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఆ పని చేయకుండా... పతకాలు, టైటిళ్ళ మీదే ధ్యాసతో, ఆటగాళ్ళను నిందించి ప్రయోజనం లేదు. ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో అధ్యాపకుల స్థాయి నుంచి అందుకు తగ్గట్టు వాతావరణం కల్పించడం ముఖ్యం. అదే సమయంలో క్రీడా సంఘాలు, ప్రభుత్వ ప్రాధికార సంస్థల లాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా నడపడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే క్రీడాకారుల కలలు ఫలిస్తాయి. క్రీడాభిమాన లోకం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒలింపిక్స్‌కు సైతం ఆతిథ్య మివ్వాలని ఆశపడుతున్న మన పాలకులు అంత కన్నా ముందు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. -
తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో
‘డార్లింగ్’ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యుల్‌లో కూడా తిరిగ్గా ‘మిల్కీ బ్యూటీ’ తమన్నాతో కలిసి ప్రభాస్ చెస్ ఆడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఎంటాని ఆరా తీస్తున్నారు. చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’ మరోవైపు తమన్నా కూడా భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ చిత్రం షూటింగ్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి చెస్ ఆడటమేంటని అంతా షాక్ అవుతున్నారు. అయితే అది ఇప్పటి వీడియో కాదు. ప్రభాస్-తమన్నా జంటగా రెబల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో వీరిద్దరు సరదాగా చదరంగా ఆడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ చదరంగంలో ఎత్తులు ఎలా వేయాలో తమన్నాకు వివరిస్తూ కనిపించాడు. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? అంతేకాదు తన ఆటతో పాటు తమన్నా ఆటను కూడా తానే ఆడుతూ ఆమెకు చెస్ నేర్పిస్తున్న ఈ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ప్యాన్ ఒకరు బిహైండ్ ది సీన్స్ అంటూ ఈ త్రోబ్యాక్ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2012ay లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్-తమన్నా హీరోహీరోయిన్లుగా రెబల్ మూవీ తెరకెక్కింది. ఇందులో దివంగత నటుడు, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ప్రధాన పాత్ర పోషించారు. I also wanna learn chess ♟️ From .#Prabhas garu😁 Darling teaching .@tamannaahspeaks chess Rebel BTS rare unseen 🤩 pic.twitter.com/wJKzbYw5Tf — Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) November 2, 2022 -
'మైండ్‌గేమ్స్' ఆడేద్దాం!
చదరంగం ఎవరు కనుగొన్నారు..? యూరప్‌లో పుట్టినట్టుంది..! కానీ అచ్చంగా అది మన భారతీయ సంప్రదాయ క్రీడ అని.. దాన్ని సృష్టించింది మన పూర్వీకులే అన్న నిజం ఎంతమందికి తెలుసు? ఈ చదరంగం ఆట వాయువ్య భారతంలో పుట్టింది. నేపాల్ దేశం జాతీయ క్రీడతో సమానంగా భావించే పులిజూదం కూడా మన సొంతమే! ఇలా చెబుతూ పోతే పచ్చీసు, అష్టాచెమ్మా, పాము–నిచ్చెన.. ఇలాంటి సంప్రదాయ ‘బోర్డ్ గేమ్స్’ అన్నీ మన సృష్టే. ఇవన్నీ మెదడకు మేత పెట్టేవే. ఆలోచనలకు పదును పెట్టేవే. ఇవన్నీ దాదాపు అన్నిదేశాల్లో ఆడుతున్నవే. మరి మనలో ఎంతమంది వీటిని ఆడుతున్నారు? ఇప్పుడు కేంద్రానికి కూడా ఇదే సందేహమొచ్చింది. వెంటనే చిన్న అధ్యయనం చేయగా.. చదరంగం మినహా మిగతావన్నీ దాదాపు అంతరించేస్థితిలో ఉన్నాయి. కేంద్రం అధీనంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు సంయుక్తంగా భారీ కార్యాచరణకు నడుం బిగించాయి. – సాక్షి, హైదరాబాద్ హ్యూమన్ కంప్యూటర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రచయిత్రి శకుంతలాదేవి. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ కంప్యూటర్ విభాగం ఇచ్చిన గణిత పజిల్‌ను ఆమె కేవలం 28 క్షణాల్లో పరిష్కరించి ఆ బిరుదు సంపాదించారు. అది అప్పట్లో గిన్నిస్ బుక్ పుటల్లో నమోదైంది. 7686369774870ను 2465099745779 గుణిస్తే వచ్చే మొత్తాన్ని ఆమె అరనిమిషం సమయం కూడా తీసుకోకుండా ఠక్కున చెప్పేశారు. మరి ఇప్పటి పిల్లలు కాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చేయగలుగుతున్నారా.. ఠపీఠపీమంటూ ఎక్కాలు వల్లించగలుగుతున్నారా? చిన్నచిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్ చూడనిదే చేయ లేని పరిస్థితికి వచ్చారు ఇప్పటి పిల్లలు. ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటి తరం క్రమంగా తీసికట్టుగా మారుతోందన్న సంగతి వెక్కిరిస్తోంది. కారణమేంటి..? సంప్రదాయ బోర్డ్ గేమ్స్ అంతరించటం.. పిల్లల్లో ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగించటం... ఈ రెండింటికి లింక్ ఉందనేది నిపుణుల మాట. అందుకే అలనాటి బోర్డు గేమ్స్ పునరుద్ధరించి మళ్లీ విస్తరించేలా చేస్తే పిల్లల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని, దీంతో జ్ఞాపకశక్తి, మేధోసంపత్తి చురుగ్గా మారుతుందని భావిస్తున్నారు. అందుకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు సంయుక్తంగా ఓ బృహత్తర కార్యాచరణ ప్రారంభించాయి. ఈ సంప్రదాయ బోర్డ్ గేమ్స్ అన్నీ సరదాగా ఆడినట్టే అనిపించినా వాటన్నింటిలో నిగూఢంగా ఆలోచనా శక్తిని పురిగొల్పే మహత్తు ఉంది. ఎత్తు వేసే ముందు ఎంతో ఆలోచించాలి. ఎదుటి వారిని చిత్తు చేయా లంటే గొప్ప ఎత్తుగడ అవసరం. అందుకు తీక్షణంగా ఆలోచించాలి. అది ఆ ఆటలో గెలుపే కాదు, జీవితంలో విజయం సాధించేందుకూ ఉపయోగపడుతుందని ఈ గేమ్స్‌పై అధ్యయనం చేసిన నిపుణులు తేల్చారు. వీటిని పునరుద్ధరిం చేందుకు వీటిపై విద్యార్థుల్లో తొలుత ఆసక్తి కలిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ మూడు సంస్థలు ఇటీవల ముంబైలో నిపుణులతో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించాయి. ఇందులో ఈ బోర్డ్ గేమ్స్‌పై అవగాహన, అధ్యయనం చేసిన నిపుణులను ఆహ్వానించారు. అలా 40 మంది పాల్గొనగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజారెడ్డి కూడా ఉన్నారు. ఏం చేస్తారు..? భారతీయ సంప్రదాయ బోర్డ్ గేమ్స్ ఏంటో గుర్తించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చదరంగం పుట్టింది ఇండియాలోనే అన్నదానికి గట్టి ఆధారాలను సహేతుకంగా గుర్తించారు. చాలా దేశాల్లో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ గేమ్స్‌కు పుట్టినిల్లు మన దేశమే అన్న విషయం తెలిస్తే... వీటిపై విద్యార్థుల్లో ఆసక్తి రగులుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సదస్సులో పేపర్స్ ప్రజెంట్ చేసినవారు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇందుకోసం చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ వైద్యులు డాక్టర్ రాజారెడ్డి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పురాతన చారిత్రక దేవాలయాలు, కోటలలో ఈ ఆటలకు సంబంధించి ఆధారాలను సచిత్రంగా సదస్సు ముందుంచారు. హైదరాబాద్ శివారులోని రాచకొండ కోటలో 12 శతాబ్దిలో ఈ ఆటలు అడినట్టు అక్కడి రాళ్లపై చిత్రించి ఉన్న చదరంగం, పులిజూదం, దడి తదితర చిత్రాలను సేకరించారు. తిరుపతికి చేరువలో ఉన్న ఈ ఆలయం క్రీ.పూ.2 వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అంటే 2021 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ ఆటలు ప్రాచుర్యంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నిపుణులు సమర్పించిన పేపర్లతో ఓ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, పాఠశాలలలకు పంపాలనేది ప్రణాళిక. ఈ ఆటలు ఎలా ఆడాలి, ఆడటం వల్ల కలిగే లాభాలు, ఈ ఆటలకు దూరం కావటం వల్ల మనకు జరిగిన నష్టం...తదితర వివరాలను సహేతుకంగా సిద్ధం చేసి విద్యార్థులకు చేరేలా చేయాలనేది ఆలోచన. ఈ ఆటల్లో ఆసక్తి రగిలే కార్యక్రమాలు నిర్వహించి మళ్లీ నేటి తరం ఆ సంప్రదాయ ఆటలవైపు చూసేలా చేయాలని నిర్ణయించారు. ఇండియా టు పర్షియా.. చదరంగం మన దేశంలో తొలుత ఆడారు. నలుగురు ఆడేలా దాన్ని రూపకల్పన చేశారు. ఆ తర్వాత అది పర్షియాకు చేరింది. అక్కడ రాజు/రాణి పావు అదనంగా చేర్చి, ఇద్దరు ఆడేలా మార్చారు. ఆ తర్వాత యూరప్, అక్కడి నుంచి చైనాకు ఆ ఆట చేరిందని నిపుణులు తేల్చిన వివరాలను ఈ సదస్సులో సమర్పించారు. పులిజూదం, పచ్చీసు, పాము–నిచ్చెన, అష్టాచెమ్మలు కూడా మన దేశం నుంచి ఇతర ఖండాలకు పాకినవేనని పేర్కొన్నారు. నా మనవరాలు సందేహంతో.. ‘అమెరికాలోని నాసాలో అధ్యయనం చేస్తున్న నా మనవరాలు సమీక్ష మా ఇంటికి వచ్చినప్పుడు చదరంగం ఎక్కడ పుట్టిందన్న ప్రశ్న వేసింది. చిన్న ఆధ్యయనంతో అది మన దేశంలోనే పుట్టిందన్న మాట చెప్పినప్పుడు అబ్బురపడి చారిత్రక ఆధారాలు సేకరించి పుస్తకం రాయాలని కోరింది. అలా మేం ఇద్దరం కలసి ఆధారాలతో ఓ పుస్తకాన్ని రూపొందించాం. ఇప్పుడు ఇదే ఆలోచనతో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు ఆ పుస్తకం గురించి తెలుసుకుని సదస్సుకు ఆహ్వానించాయి. అక్కడ నేను మా అధ్యయనంలోని వివరాలు అందించా. 40 మంది నిపుణులు అద్భుతమైన వివరాలు సమర్పించారు. త్వరలో అవన్నీ దేశవ్యాప్తంగా విద్యార్థులకు చేరతాయి. మన సంప్రదాయ బోర్డు గేమ్స్‌కు పాత రోజులొస్తే కచ్చితంగా విద్యార్థులకు మేలు కలుగుతుంది’ – డాక్టర్ రాజారెడ్డి -
చెస్‌కు ఆదరణ పెంచాలని సింప్లీ ఫౌండేషన్ కృషి
-
వైకల్యం మెదడుకు కాదు..
చెస్‌లో దూసుకెళుతున్న స్నేహిత్ ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో ప్రాతినిధ్యం కొడుకు కోసం ఉద్యోగాన్ని వీడిన తండ్రి అంగవైకల్యం కారణంగా అందరిలా నడవలేడు... ఆడలేడు.. చక్రాల కుర్చీకే పరిమితం.. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన స్నేహిత్ పరిస్థితి చిన్నప్పటి నుంచీ ఇంతే.. అయితేనేం అతడు నిరాశను దరిచేరనీయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి చెస్ ఆటగాడిగా ఎదిగాడు. - మహ్మద్ సాబేర్ మొహియోద్దీన్, మహబూబ్‌నగర్ చదరంగం క్రీడలో స్ఫూర్తిదాయక విజయాలతో దూసుకెళుతున్న స్నేహిత్ స్వస్థలం మహబూబ్‌నగర్ లోని క్రిస్టియన్‌పల్లి. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన తను అందరిలా నడవలేడు. అంగవైకల్యం కారణంగా చక్రాల కుర్చీనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు అతడికి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని అందించారు. ఇంటి వద్దనే చదువు చెప్పించారు. కాస్త కాలక్షేపంగా ఉంటుందని చెస్‌ను పరిచయం చేశారు. అయితే ఈ క్రీడను తను మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. తల్లి రమాదేవి శిక్షణ స్నేహిత్‌ను మరింత రాటుదేలేలా చేసింది. దీంతో తక్కువ కాలంలోనే నైపుణ్యం కలిగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ మెరిశాడు. ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న సే్నిహ త్ దగ్గర ఎప్పుడూ ఒకరు అందుబాటులో ఉండాల్సి రావడంతో తండ్రి రవీందర్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి కొడుకు ప్రగతికి తోడ్పాటు నందిస్తున్నారు. సాధించిన విజయాలు... 2002లో లయన్స్ క్లబ్ నిర్వహించిన మండల స్థాయి, జిల్లా స్థాయి చెస్ పోటీల్లో స్నేహిత్ విజేతగా నిలిచాడు. 2003లో నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లోనూ రాణించి ద్వితీయ స్థానం పొందాడు. మహబూబ్‌నగర్‌లో మల్లికార్జున్ మెమోరియల్ పేరిట నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో, ఏపీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2005లో ‘బ్రహ్మ మెంటల్లీ రిలేటెడ్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నీలో పాల్గొని మొదటి స్థానాన్ని పొందాడు. 2006లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొని రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 2010లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన చెస్ టోర్నీలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి వికలాంగుల టోర్నీకి ఎంపికయ్యాడు. ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీకి... 2013 అక్టోబర్‌లో జర్మనీలోని డ్రెస్డెన్లో జరిగిన ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో స్నేహిత్ పాల్గొన్నాడు. ఆ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు క్రీడాకారులతో తలపడ్డాడు. స్నేహిత్ ప్రతిభను గుర్తించిన అక్కడి మీడియా అతడిపై ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.