సాక్షి, సినిమా: దక్షిణాది చిత్రసీమలో గుర్తుండిపోయే నటీమణుల్లో తమాన్నా పేరు కచ్చితంగా చోటుచేసుకుంటుంది. దశాబ్దంన్నర దాటినా నాయకిగా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో మిల్కీబ్యూటీ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్‌తో తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నారు. ఇదే చిత్రంలో నయనతార కూడా నాయకిగా నటించడం విశేషం. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ‘కన్నె కలమానే’చిత్రంలో నటిస్తున్నారు.
కాగా ఇప్పుడు సినీ పరిశ్రమలో బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందనే చెప్పొచ్చు. అయితే ఇక అతిలోక సుందరిగా భారతీయ సినీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటి శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనీకపూర్ డాక్యుమెంటరీగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం. ఈ పరిస్థితుల్లో నటి తమాన్నా శ్రీదేవి పాత్రలో నటించాలన్న కోరికను వ్యక్తం చేయడం విశేషం. ఇటీవల ఆమె ఒక భేటీలో నటి శ్రీదేవి, సానియా మిర్జాల పాత్రల్లో నటించాలని ఆశగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఆ అమ్మడు మాట్లాడుతూ.. సమీప కాలంలో బయోపిక్‌లు అధికంగా తయారవుతున్నాయని, ఆ చిత్రాలకు మంచి ప్రజాదరణ లభిస్తోందని ఆమె అన్నారు. అందుకే తానూ అలాంటి బయోపిక్‌లో నటించాలని ఆశపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆశపడవచ్చు...అత్యాశపడకూడదు. మరి తమాన్నాది ఆశ అవుతుందా? అత్యాశే అవుతుందా? అన్నది వేచి చూడాలి.
ఇప్పటివరకు మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్ర హిందిలో తెరకెక్కి ఘనవిజయం సాధించింది. ఆదే విధంగా నటి సిల్క్‌స్మిత బయోపిక్ నటి విద్యాబాలన్‌కు ఏకంగా జాతీయ అవార్డునే అందించింది. క్రికెట్ క్రీడాకారుడు ధోని జీవిత చరిత్ర సినిమాగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఎంజీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతోంది. ఇక మహానటి సావిత్రి జీవితం ఇటీవలే వెండితెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందులో సావిత్రిగా జీవించిన యువనటి కీర్తీసురేశ్‌కు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment