‘హీరోపై మిల్కీ బ్యూటీ పొగడ‍్తల వర్షం’
అది బాహుబలి పెయిర్ రిపీట్ అయితే బాగుండని భావించిన తమన్న అలాంటి అవకాశం సంపాదించుకునే పనిలో ముమ్మరంగా పడ్డట్టుంది. ఇందులో భాగంగా ఒక భేటీలో నటుడు ప్రభాస్ అద్భుతమైన నటుడు, అంతేకాకుండా తనకు మంచి ఫ్రెండ్ అంటూ తెగ పొగిడేసింది. మళ్లీ ప్రభాస్‌తో కలిసి నటిస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని పేర్కొంది. అయితే మంచి కథ అయితేనే తామిద్దరం కలిసి నటించే అవకాశం ఉంటుందనీ చెప్పుకొచ్చింది. తనపై ప్రేమాభిమానాలు ఉన్న వారే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. వారు బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రంలో నటించే అవకాశాన్ని అందిస్తారనే నమ్మకం తనకుందనే ఆశాభావాన్ని తమన్న వ్యక్తం చేసింది.