
అలా ఆలోచించడం అమానుషం!
పదిహేనేళ్లు.... ఈ రోజుల్లో ఓ హీరోయిన్ ఇంత సుదీర్ఘంగా కెరీర్ కొనసాగించడం గొప్ప విషయమే. ‘ఇష్టం’తో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీయా శరణ్ ఇప్పటివరకూ హీరోయిన్‌గానే కొనసాగుతున్నారు. తాజాగా ‘ఊపిరి’లో నాగ్‌కు జోడీగా కనిపించారు.
హీరోయిన్ కెరీర్ వయసు చాలా తక్కువని అనుకునే చాలా మంది నమ్మకాన్ని వమ్ము చేశారామె. ఈ లాంగ్ ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘హీరోయిన్ అంటే జస్ట్ ఐదేళ్లు సినిమాలు చేయాలి.. ఆ తర్వాత వెళ్లిపోవాలి అనే ఆలోచన సరి కాదు. అలా అనుకోవడం అమానుషం.
కాలం మారుతోంది. ఒకప్పటిలా ఇప్పుడు కథానాయిక పాత్రలకూ ప్రాధాన్యం పెరుగుతోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ పెరిగాక ఆర్ట్ సినిమాకూ, కమర్షియల్ సినిమాకూ వ్యత్యాసం తగ్గిపోయింది. ‘లంచ్‌బాక్స్’, ‘కహానీ’ తరహా చిత్రాలు రావడానికి కారణం కూడా ఇదే. హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగాలను కునేవాళ్లకిఇది కరెక్ట్ టైమ్’’ అని చెప్పారు.