
'ఊపిరి' విడుదలకి డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో భారీ పోటి మధ్య తన సినిమా సోగ్గాడే చిన్నినాయనాతో సత్తా చాటిన నాగార్జున, నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటిస్తున్నాడు నాగ్. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ అతిథి పాత్రలో అలరించనుంది. ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్ రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫైనల్ చేశారు చిత్రయూనిట్.
ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమా.., ఆడియో రిలీజ్తో పాటు సినిమా రిలీజ్కు కూడా డేట్స్ ఫైనల్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో పివిపి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోను ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. వేసవి కానుకగా మార్చ్ 25న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.