
అనుష్క భర్తగా 'భద్ర'
విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న 'స్వీటి' అనుష్క.. అక్కినేని నాగార్జున 'ఊపిరి'లో అతిథి పాత్ర చేస్తోంది. ఈ సినిమాలో ఆమెకు భర్తగా అడివి శేష్ నటిస్తున్నట్టు సమాచారం. 'బాహుబలి' సినిమాలో భల్లాల దేవ(దగ్గుబాటి రానా) తనయుడు భద్రగా అడివి శేష్ నటించాడు. తాజాగా 'ఊపిరి'లో అనుష్క సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్టు చిత్రపురి సమాచారం. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వినాయక చవితికి విడుదల చేసిన 'ఊపిరి' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సైజ్ జీరో' సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అనుష్క సరసన ఆర్య నటించాడు.