
స్నేహమే ఊపిరి
ఏ రక్తసంబంధం లేకుండా మనిషికి చివరి వరకూ తోడుగా నిలిచేది స్నేహం మాత్రమే. వీల్ చైర్ కు పరిమితమై చీకటిలో జీవితాన్ని వెళ్లదీస్తున్న ఓ వ్యక్తికి స్నేహం రూపంలో వెలుగునిచ్చాడు మరో వ్యక్తి. అలాంటి ఇద్దరి కథే ‘ఊపిరి’. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘నా కెరీర్‌లో ఇది డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది’’ అని నాగార్జున చెప్పారు.
‘‘తెలుగులో నేను చేస్తున్న మొదటి స్ట్రయిట్ మూవీ ఇది. నాగార్జునగారితో పనిచేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్’’ అని కార్తీ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మా కథకు వంద శాతం సూట్ అయ్యే టైటిల్ ఇది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అని చెప్పారు. స్నేహానికి అర్థం చెప్పే ఇద్దరు స్నేహితుల కథ ఇదని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కె మెరా: పీఎస్ వినోద్, కథ: వంశీ పైడిపల్లి, హరి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్.