మనం, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న నాగార్జున ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఊపిరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళ వర్షన్ 'తోజా' ఆడియో రిలీజ్ సందర్భంగా.., కింగ్ నాగార్జున ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశాడు.
నాగ్తో పాటు కార్తీ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళ ఆడియో వేడుకకు సూర్య ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య తన అభిమాన నటుడన్న నాగ్. గజిని సినిమా తరువాత సూర్య కేవలం తమిళంలోనే కాదు.. తెలుగు రాష్ట్రల్లో కూడా పాపులర్ హీరోగా ఎదిగారన్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఊపిరి సినిమాలో శ్రియ అతిథి పాత్రలో అలరించనుంది.
ఇప్పటికే పలు ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించిన నాగార్జున ఈ సినిమాతో వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు. ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకుడు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పీవీపీ ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తోంది.
'నా అభిమాన నటుడు సూర్య' : నాగార్జున
Published Sun, Feb 28 2016 10:03 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement
Advertisement