‘భరత్ అనే నేను’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సిల్వర్ జూబ్లీ (25) సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో జరుగుతోంది. తొలిసారిగా మహేష్ ఈ సినిమా కోసం కొత్తలుక్‌ను ట్రై చేస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమా అంటే ఆ సినిమాలో కచ్చితంగా ప్రకాష్ రాజ్ ఉండాల్సిందే. ఒకటి రెండు సినిమాలు తప్ప మహేష్ హీరోగా నటించిన అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు. ఇప్పుడు మహేష్ 25వ సినిమాలోనూ ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడట.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మహేష్ బాబు తండ్రిపాత్రలో నటిస్తున్నాడు. గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వీరిద్దరు తండ్రి కొడుకులుగా నటించారు. అందుకే సెంటిమెంట్ పరంగానూ ఈ కాంబినేషన్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎక్కువ భాగం ఫారిన్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment