మహేష్ 26.. 150 కోట్ల బడ్జెట్‌..! | Mahesh Babu Sukumar Film Budget Revealed | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 6 2018 1:03 PM | Last Updated on Thu, Sep 6 2018 4:21 PM

Mahesh Babu Sukumar Film Budget Revealed - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పొట్లూరి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా మహేష్ ఇప్పటికే ప్రకటించాడు. రంగస్థలంతో సూపర్‌హిట్ కొట్టిన సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్ తన తదుపరి చిత్రం చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. కథా కథనాల పరంగా పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయనున్నారట. అందుకే ఇంతటి భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణలు వివరాలను వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement