
‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
మహా శివరాత్రికి ఈ చిత్రం నుంచి మరో టీజర్ రాబోతోందని.. మహేష్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసేట్టుగా ఈ టీజర్ ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రబృందం.. గ్రామీణ నేపథ్యంలో ఉండే సన్నివేశాలకు సంబంధించిన పార్ట్‌ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ వైరల్ కాగా.. ఈ చిత్రం గురించి మహేష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డె కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment