
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఇది మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావటానికి మరింత సమయం పడుతుందన్న ఆలోచనతో విడుదల కొద్ది రోజులు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మహర్షి యూనిట్. ఏప్రిల్ 25న కాకుండా మే 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment