Maharshi Leaked VIDEO | Mahesh's Maharshi Movie Press Meet Scene Leaked Photos - Sakshi
Sakshi News home page

వైరల్‌ అవుతున్న ‘మహర్షి’ వీడియో

Published Tue, Jan 29 2019 2:14 PM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

Mahesh Babu Maharshi Movie Photos And Videos Viral - Sakshi

మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. పొల్లాచ్చిలో తాజాగా షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌కు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీకి ‘మహర్షి’  టీమ్‌ వెళ్లనుంది. అంతటితో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. 

తాజాగా ‘మహర్షి’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పచ్చని పొలాల్లో మ‌హేష్ మీడియాతో మాట్లాడుతున్నట్టు ఒక పిక్ ఉండ‌గా, షూటింగ్‌ లొకేషన్స్‌కు సంబంధించిన మరో వీడియో ఉంది.  చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement