
సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్నాడు. బ్రహ్మోత్సవం షాక్ నుంచి వెంటనే కోలుకున్న ప్రిన్స్, అభిమానుల కోసం వరుస సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను ప్రారంభించాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డ్లను తిరగరాయటం కాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ సినిమా బ్యానర్లో సినిమాకు ఓకె చెప్పేశాడు. ఊపిరి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన వంశీ, మహేష్ కోసం స్టైలిష్ ఎంటర్టైనర్ను రెడీ చేశాడు. ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల శివ దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. తనకు శ్రీమంతుడు లాంటి కెరీర్ బెస్ట్ అందించిన కొరటాలతో మరో సినిమా చేస్తే తన ఇమేజ్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు.