
మహేశ్‌బాబు
మహేశ్‌బాబు లేటెస్ట్ చిత్రం ‘మహర్షి’ ఆలస్యం అవుతుంది, జూన్‌లో రిలీజ్ కానుంది అని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్ 25నే వస్తున్నాం అని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’రాజు, పీవీపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘అల్లరి’ నరేశ్ కీలకపాత్రలో కనిపిస్తారు. ‘‘చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.మార్చి 15 నాటికి రెండుపాటలు మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముందు ప్రకటించినట్టు ఏప్రిల్ 25నే చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. మహేశ్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: కె.యు. మోహనన్.
Comments
Please login to add a commentAdd a comment