
సూర్య చిత్రం వస్తుందంటే భయపడతారు
సూర్య చిత్రం వస్తుందంటే తెలుగు నిర్మాతలు భయపడతారని ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున వ్యాఖ్యానించారు.నాగార్జున చాలా కాలం తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం తోళా.తెలుగులో ఊపిరి పేరుతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా కార్తీ నటిస్తున్నారు.
తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.పీవీపీ సినిమా సంస్థ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక శాంథోమ్ రోడ్డులోని శాంథోమ్ సెయింట్స్ పీట్స్ పాఠశాలో జరిగింది.కుట్టి హెలీకాప్టర్‌లో వేదిక పైగా వచ్చిన ఆడియో సీడీ పెట్టి నటుడు సూర్య అందుకుని ఆడియోను ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోల్లో ఒకరైన నాగార్జున మాట్లాడుతూ తానూ చెన్నై వాడినేనన్నారు.
ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు.ఇందులో నటించిన తరువాత తాను కార్తీ మంచి సన్నిహితులం అయ్యాం అన్నారు. సూర్యకు ఆంధ్రాలో అభిమానులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అభిమానులు తమిళనాడులోని ఆయన అభిమానులకు దీటుగా ఉంటారన్నారు.సూర్య నటించిన చిత్రాలు తెలుగులోకి అనువాదమై విడుదలవుతున్నాయంటే తెలుగు నిర్మాతలు భయపడి వారి చిత్రాల విడుదలను వాయిదా వేసుకుంటారని తెలిపారు.ఈ తోళా చిత్రంలో నాగార్జున,కార్తీలతో కలిసి నటించడం చాలా సంతోషకరమైన విషయం అని నటి తమన్నా పేర్కొన్నారు.
దేవదాసు దుమ్మురేపింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీయర్ నటుడు శివకుమార్ మాట్లాడుతూ 1940లో విడుదలైన దేవదాసు చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించి వాడ వాడలా మారుమోగిందన్నారు.ఆ చిత్ర కథానాయకుడు నాగేశ్వరరావు అని ఆయన అభిమానిని తాననీ పేర్కొన్నారు.ఆ నాగేశ్వరరావు కొడుకే ఇక్కడ మన మధ్య ఉన్న నాగార్జున అని చెప్పారు.ఈ చిత్రం నాగార్జున అభిమానిగా కార్తీ నటించడం తనకు గర్వం అని శివకుమార్ పేర్కోన్నారు.