
'నేను తప్పని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్'
నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊపిరి సినిమాకు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఊపిరి చిత్రయూనిట్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇంటచబుల్స్ ఒకటి. నిజంగా చెప్పాలంటే.. ఈ సినిమాకు వంశీ న్యాయం చేయగలడని నేను నమ్మలేదు. థ్యాంక్స్ వంశీ.. నేను తప్పని నిరూపించినందుకు. భారతీయులకు తగ్గట్టుగా ఈ సినిమాను నువ్వు మార్చిన తీరు సినిమా స్థాయిని పెంచింది. కార్తీ చాలా బాగా చేశాడు. నాగార్జున గారు నిజమైన పాత్ బ్రేకర్. నిర్మాత పివి గారికి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు. ఊపిరి మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడే నిజమైన ఎంటర్టైనర్. డోంట్ మిస్ ఇట్' అంటూ ట్వీట్ చేశారు.
ఫ్రెంచ్ మూవీ ద ఇంటచబుల్స్కు రీమేక్గా రూపొందిన ఊపిరి సినిమాలో నాగ్, కార్తీ ప్రధాన పాత్రలో నటించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. భారీ చిత్రాల నిర్మాణ సంస్ధ పివిపి సినిమా 60 కోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊపిరి సినిమాకు మంచి స్పందన వస్తోంది. హీరో నితిన్ కూడా సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.
Intouchables is one of my favourites. Frankly I didn't think Vamsi would be able to handle it. Thanks Vamsi for proving me wrong.
— rajamouli ss (@ssrajamouli) March 25, 2016
The scenes you indianised made it a better film. Karthi is so good. Nagarjuna garu is a true path breaker.
— rajamouli ss (@ssrajamouli) March 25, 2016
Congratulations to PV garu and the whole team. Oopiri is A true entertainer that stays with you for a long time. Don't miss it...
— rajamouli ss (@ssrajamouli) March 25, 2016
This summer starts off with a bang!! Oopiri hearin grt things bout d film..congrats nag sir n to the entire team of oopiri
— nithiin (@actor_nithiin) March 25, 2016