భరత్ అనే నేను రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. కొత్త సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించేందుకు మేకోవర్ అవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చేయనున్నారు మహేష్. ఈ సినిమాలో మహేష్ గడ‍్డంతో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ మహేష్ గడ్డంతో దర్శనమిచ్చాడు.