సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని నటిస్తోంది.
ఈ సినిమా తరువాత మహేష్ చేయబోయే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇప్పుడే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అశ్వనిదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment