మహేష్ బాబు
ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశపరచటంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. స్పైడర్ రిలీజ్ తరువాత వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరున ‘భరత్ అనే నేను’ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
‘భరత్ అనే నేను’ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే తన 25వ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు మహేష్. ఇప్పటికే ప్రకటించినట్టుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నాడు. ప్రముఖ నిర్మాతలు అశ్వనిదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment