
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూట్ మారుస్తున్నాడు. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మహేష్, మాస్ ఆడియన్స్‌లో ఆ స్థాయి ఫాలోయింగ్ సాధించలేకపోయాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఫ్లాప్ టాక్‌తో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తుంటే మహేష్ మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాడు.
మహేష్ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే భారీ నష్టాలు తప్పటం లేదు. ఇటీవల రిలీజ్ అయిన స్పైడర్ విజయంలోనూ అదే జరిగింది. అందుకే మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న భరత్ అను నేను అనే పొలిటికల్ డ్రామాలోనూ నటిస్తున్న మహేష్, ఆసినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
అదే సమయంలో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాలతో మాస్‌కు చేరువయ్యేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే బోయపాటి మహేష్ కోసం ఓ కథ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాను గతంలో మహేష్‌తో వరుస సినిమాలు నిర్మించిన 14 రీల్స్‌సంస్థ నిర్మించే ప్లాన్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment