
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. మహేష్ 25వ గా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప‍్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ మీసకట్టుతో కనిపించనున్నాడట. భరత్ అనే నేను ప‍్రమోషన్ సమయంలో తదుపరి చిత్రంలో కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టుగా వెల్లడించారు మహేష్. అయితే సినిమా అంతా మహేష్ మీసంతోనే కనిపిస్తాడా..? లేక కొద్దిసేపే అలా కనిపిస్తారా..? అన విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment