
అనుష్క ఓకే అంది !
హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున - కార్తీ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో టాలీవుడ్ జేజమ్మ, అందాల నటి అనుష్క అతిథి పాత్రలో నటించనుందని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు అతిథ పాత్రలో ఒదిగిపోయే నటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అందులోభాగంగా పలువురు హీరోయిన్లు ఆయన దృష్టికి వచ్చారు. ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేయాలంటే అనుష్క అయితేనే కరెక్ట్ అని ఆయన భావించారు. అనుకున్నదే తడువుగా వంశీ పైడిపల్లి ఇటీవల అనుష్కను కలిశారు.
తన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ చిత్రంలో అతిథి పాత్ర ఉంది... అందులో మీరైతే ఒదిగిపోతారని భావిస్తున్నాను.. అంటూ అతిథి పాత్రకు సంబంధించిన విశేషాలు ఆమెను వివరించి...మీరు నటించేందుకు సిద్ధమేనా అని వంశీ అనడం... నాకు ఓకే అంటూ అనుష్క చెప్పడం చకచకా జరిగిపోయాయి.
నాగార్జున, కార్తీ, తమన్నా, శ్రుతీ హసన్లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో మెరిసిపోనుంది. 2011లో ఫ్రెంచ్ కామెడీ, డ్రామాల సమాహరం 'ద ఇన్టచబుల్' చిత్రానికి రీమేకే ఈ మల్టీస్టారర్ చిత్రం. అయితే ఈ చిత్రంలో నాగార్జున చక్రాల కుర్చీకే పరిమితమే పాత్రలో నటించనున్నారని సమాచారం.