
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను అభిమానులులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే చిరంజీవి ఇంటి దగ్గర అభిమానుల సందడి కనిపించింది. బుధవారం ఉదయం నుంచి సినీ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి క్యూ కట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా చిరు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఇదంతా ఒకెత్తే సాయంత్రం అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ మరో ఎత్తు. అరవింద్ ఇంట్లో జరిగిన వేడుకల్లో మెగా కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. చిరుతో కలిసి దర్శకులు వంశీ పైడిపల్లి, సుకుమార్, పరశురామ్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, వక్కంతం వంశీ, మెహర్ రమేష్, సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో మెగా తనయుడు రామ్ చరణ్‌తో పాటు అల్లువారబ్బాయిలు అల్లు అర్జున్, శిరీష్‌లు కూడా కనిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment