
అవును... మహేశ్‌తో అల్లరి నిజమే!
ఫిల్మ్‌నగర్‌లో ఈ వారం జోరుగా హుషారుగా దూసుకెళుతోన్న వార్తల్లో మహేశ్‌బాబు–‘అల్లరి’ నరేశ్‌ల కాంబినేషన్ గురించిన వార్త ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించనున్న చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ కూడా నటించనున్నారనేది ఆ వార్త సారాంశం.
ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొట్టే వార్తల్లో దాదాపు నిజమైనవే ఉంటాయి. ఈ కాంబినేషన్ నిజమేనని చిత్రసన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరి.. ‘అల్లరి’ నరేశ్ కూడా ఓ హీరోగా చేస్తారా? స్పెషల్ క్యారెక్టరా? అనేది తెలియాల్సి ఉంది. పాత్ర ఏదైనా బాగానే ఉండి ఉంటుంది. అందుకే అల్లరోడు అంగీకరించి ఉంటారని ఊహించవచ్చు. అక్టోబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.