
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధి డెహ్రడూన్లో ఓ మేజర్ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేశారు. మరో షెడ్యూల్ కోసం త్వరలో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు మహేష్.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తను తదుపరి చిత్రం చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశాడు. అయితే ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న మహేష్ తరువాత బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు. దీంతో సుకుమార్ కాంబినేషన్‌లో చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment