ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం | Dil raju, Vamsi Paidipally Comments on Yevadu film | Sakshi
Sakshi News home page

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం

Published Sun, Jan 19 2014 10:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వంశీ పైడిపల్లి

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వంశీ పైడిపల్లి

 ‘ఎవడు’ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు
 
 రాజమండ్రి :‘ఎవడు’ సినిమా నిర్మాణ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజులు తెలిపారు. ఎవడు విజయవంతంతో రాజమండ్రి వచ్చిన ఆ చిత్ర యూనిట్, నటులు సాయికుమార్, ఎల్‌బీ శ్రీరాం స్థానిక ఆనంద్‌రీజె న్సీలో శనివారం విలేకరులతో మాట్లాడారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ తాము పడ్డ కష్టమంతా ఒక్క మార్నింగ్ షోతో మర్చిపోయామన్నారు. ఒకే తెరపై ఇద్దరు అగ్రహీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లను చూపడం సామాన్య విషయం కాదని, దానికి చాలా కష్టపడ్డామన్నారు. తెలంగాణపై ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ తెలుగు ప్రజలు ఉన్నంతవరకు తెలుగు సినిమా బతికే ఉంటుందన్నారు.
 
 
 దిల్‌రాజు..
 రెండు సంవత్సరాల కష్టం ఈ సినిమా విజయంతో తెలియడం లేదు. సినిమా నిర్మాణం పూర్తయ్యాక విడుదల కోసం ఆరు నెలలు ఆగాల్సివచ్చింది. సినిమాలో విషయం ఉంటే ఎంత ఆలస్యమైనా ప్రేక్షకులు ఆదరిస్తాని ఎవడు సినిమా నిజం చేసింది. మా బ్యానర్‌లో మొత్తం 16 సినిమాలు తీస్తే వాటిలో 12 సినిమాలు మంచి విజయం సాధించాయి.
 
 సాయికుమార్
 పోలీస్‌స్టోరీలో నేను ధరించిన అగ్ని పాత్ర ఇంకా జనం మర్చిపోలేదు. దానికి పోటీగా ఈ సినిమాలో నేను చేసిన ధర్మ పాత్ర నిలుస్తుంది. దీంతో నాకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 2014 శుభారంభంగా ఉంది. ప్రతీ పాత్రను నటీనటులు ఇందులో ఒక అద్భుతంగా చేశారు.
 
 ఎల్‌బీ శ్రీరాం..
 మాది అమలాపురం సమీపంలోని నేదునూరు గ్రామం. పగలు ఉద్యోగం చేసుకుంటూ రాత్రుళ్లు కథలు రాసుకునే వాడిని. సుమారు 40 చిత్రాలకు పైగా కథలు రాశాను. ఈవీవీ తీసిన ‘చాలా బాగుంది’ సినిమాతో నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘అమ్మో ఒకటో తారీఖు’తో నటుడిగా స్థిరపడ్డాను. ఎవడు సినిమాలో నా పాత్ర చాలా కీలకం.
 
 థియేటర్‌లో సందడి...
 ‘ఎవడు’ చిత్ర యూనిట్ అప్సరా థియేటర్‌కు వెళ్లి సందడి చేసింది. యూనిట్ రాకతో కొంతసేపు చిత్ర ప్రదర్శన నిలిపివేశారు. నటుడు సాయికుమార్ ధర్మ పాత్ర డైలాగులను చెప్పేసరికి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేశారు. సహాయ నటులు శశాంక్, సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా, కెమెరామెన్ హరి, నృత్య
 దర్శకుడు జానీ మాట్లాడుతూ ఈ సినిమాకు  పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గీతా ఫిల్మ్‌డిస్ట్రిబ్యూటర్‌‌స మేనేజర్ సీవీ రామ
 శాస్త్రి యూనిట్‌కుఅభినందనలు తెలియజేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement