
ట్విట్టర్ వేదికగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పోస్ట్ చేసిన ఓ పజిల్ కు అఖిల్ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు 25వ సినిమాకు సంగీతమందించే పనుల్లో బిజీగా ఉన్న దేవీ శ్రీ, విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు. తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన దేవీ.. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ఎవరు..? ఎక్కడున్నారు..? అక్కడ ఏం జరుగుతోంది అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ పై స్పందించిన అక్కినేని యంగ్ హీరో అఖిల్, 'కుడి వైపు ఉన్న వ్యక్తి వంశీ, మరో వ్యక్తి నువ్వే' అంటూ ట్వీట్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ బాబు 25వ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈసినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా యూనిట్ సభ్యులు ఫారిన్ లో మకాం వేశారు. ఈ ఫోటో సంగీత చర్చలు జరుగుతున్న సమయంలో తీసినప్పటిదే అయి ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.
The one on the right is Vamshi and left is you
— Akhil Akkineni (@AkhilAkkineni8) 26 October 2017
Comments
Please login to add a commentAdd a comment