Vijay : విజయ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. టాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్ | Thalapathy 66: Actor Vijay Joins Hand With Director Vamsi Paidipally For His Next Movie | Sakshi
Sakshi News home page

Vijay : విజయ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. టాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్ !

Published Sun, May 30 2021 3:33 PM | Last Updated on Sun, May 30 2021 5:55 PM

Thalapathy 66: Actor Vijay Joins Hand With Director Vamsi Paidipally For His Next Moive	 - Sakshi

ఇళయదళపతి విజయ్‌ అభిమానుకు గుడ్‌ న్యూస్‌ ఇది. త్వరలోనే ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కన్‌ఫర్మ్‌ చేశారు. వీరిద్దరి  కాంబినేషన్‌లో ఓ  చిత్రం రూపొందబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అటు విజయ్ గానీ ఇటు వంశీ పైడిపల్లి గానీ స్పందించలేదు. దీంతో ఇది కేవలం రూమరే అని అంతా కొట్టిపారేశారు. అయితే తాజాగా విజయ్‌తో తన సినిమా ఉండబోతోందని, ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు వంశీ పైడిపల్లి తెలిపాడు.  

లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటిస్తామని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా విజయ్‌కి టాలీవుడ్‌లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇక 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కాల్సి ఉండగా అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం విజయ్‌ నెల్సన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే వంశీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement