
టాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇంతకాలం రిజర్వ్‌డ్‌గా ఉన్న హీరోలు ఒక్కటై పోతున్నారు. మల్టీ స్టారర్లు.. బడా హీరోలు ఒక్కచోట చేరి సందడి చేయటం.. ఒకరి చిత్రాలకు మరొకరు ప్రమోషన్లు చేసుకుంటూ తిరిగి పాత రోజులను గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు తరచూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుండటం చూస్తున్నాం.
(మేం మేం బాగానే ఉంటాం. మీరూ మీరే బాగుండాలి)
ఆ మధ్య భరత్ అనే నేను బహిరంగ సభ ఈవెంట్ సందర్భంగా జరిగిన పార్టీలో సందడి చేసిన ఈ ముగ్గురు స్టార్స్.. ఇప్పుడు మరోసారి కనులవిందు చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్ డే పార్టీకి హాజరయి ఫోటోలకు ఫోజులిచ్చారు. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దిల్ రాజు, నటి పూజా హెగ్డే తదితర ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment