హమ్మయ్య.. స్పైడర్ షూటింగ్ పూర్తయ్యింది..! | Mahesh Babu Spyder Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. స్పైడర్ షూటింగ్ పూర్తయ్యింది..!

Published Sat, Sep 9 2017 12:48 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

హమ్మయ్య.. స్పైడర్ షూటింగ్ పూర్తయ్యింది..! - Sakshi

హమ్మయ్య.. స్పైడర్ షూటింగ్ పూర్తయ్యింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి షాట్ పూర్తయినట్టుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ లో వెల్లడించింది. షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 27న తెలుగు తమిళ భాషల్లో భారీగా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో భరత్ మరో విలన్ గా కనిపించనున్నాడు. తమిళ నటుడు ఆర్జే బాలాజీ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళనాట ఈ రోజు (09-09-2017) ఏర్పాటు చేసిన భారీ ఆడియో రిలీజ్ వేడకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందు హైదరాబాద్ తో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement