
రకుల్ ప్రీత్ మళ్లీ రూటు మారుస్తోంది!
చెన్నై: నటి రకుల్‌ప్రీత్ సింగ్ తాజాగా కోలీవుడ్‌పై గురి పెట్టినట్లుంది. ఈ ఉత్తరాది బ్యూటీ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక్కడ యంగ్ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, నాగచైతన్య లాంటి హీరోలతో నటించి హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాలతో రానున్న స్పైడర్ చిత్రంలో నటించిన రకుల్.. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ భామకు స్పైడర్ రీ ఎంట్రీ చిత్రం అవుతుంది.
నిజానికి తొలుత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రకుల్ 'తడయార తాక్క', పుత్తగం, 'ఎన్నమో ఏదో' మూవీలలో నటించింది. ఏ ఒక్కటీ ఆశించిన విజయాలను అందుకోక పోవడంతో అమ్మడిని పక్కన పెట్టేశారు. దీంతో టాలీవుడ్‌కు జంప్ చేసి వరుస సక్సెస్‌లను అందుకుంది. అయితే తాజాగా కోలీవుడ్‌పై ఆమె కన్నేసినట్లుంది. స్పైడర్‌తో కలిపి కోలీవుడ్‌లో నాలుగు భారీ చిత్రాలు రకుల్ చేతిలో ఉన్నాయి. స్పైడర్ త్వరలో విడుదలకు ముస్తాబవుతుండగా తాజాగా కార్తీకి జంటగా ధీరన్ అధికారం ఒండ్రు, సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సరసన ఒక చిత్రం ఇప్పటికే కమిట్ అయింది.
కార్తీతో నటిస్తున్న ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ దశలో ఉండగా, సూర్యతో రొమాన్స్ చేసే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. వీటితో పాటు ఇళయదళపతి విజయ్‌తో జోడీ కట్టే అవకాశాన్ని కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మెర్శల్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. దీంతో కోలీవుడ్‌లో టాప్ పోజిషన్‌కు ఈ భామ గురి పెట్టినట్లు తెలుస్తోంది.