ఆయన నుంచి చాలా నేర్చుకున్నా: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ | Rakul Preet Singh Interesting Comments About Kamal Haasan Indian 2 Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: ఆయన నుంచి చాలా నేర్చుకున్నా

Published Mon, Jul 1 2024 2:11 AM | Last Updated on Mon, Jul 1 2024 11:49 AM

Rakul preet Singh About Kamal Haasan Indian 2

హీరో యిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ది చిత్ర పరిశ్రమలో దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం. 2009లో ‘జిల్లీ’ అనే కన్నడ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా రకుల్‌ప్రీత్‌ నటించిన చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు 2’ మూవీలో కీలక పాత్ర పోషించారామె. ఈ నెల 12న ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతోంది. 

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘భారతీయుడు 2’ సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ చిత్రం కోసం విలక్షణ నటులు కమల్‌ హాసన్‌ సర్‌తో, గొప్ప దర్శకుడైన శంకర్‌ సర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. షూటింగ్‌ సమయంలో శంకర్‌ సర్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు. తెరపై కథలని, పాత్రలను ఆయన చూపించే విధానం అద్భుతం. 

శంకర్‌సర్‌ ఆలోచనా విధానం, సృజనాత్మకత గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అన్నారు. ఇదిలా ఉంటే.. రకుల్‌ ప్రస్తుతం హిందీలో ‘మేరీ పత్నీకా రీమేక్, దే దే ΄్యార్‌ దే 2’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. కాగా నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్‌ వివాహం ఈ ఫిబ్రవరి 21న జరిగిన విషయం తెలిసిందే. అటు వ్యక్తిగత జీవితం, ఇటు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు రకుల్‌ప్రీత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement