మైండ్‌ బ్లోయింగ్‌ ‘బూమ్ బూమ్’ వచ్చేసింది.. | spyder first singl boom.. boom released | Sakshi
Sakshi News home page

మైండ్‌ బ్లోయింగ్‌ ‘బూమ్ బూమ్’ వచ్చేసింది..

Published Wed, Aug 2 2017 8:27 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

మైండ్‌ బ్లోయింగ్‌  ‘బూమ్ బూమ్’ వచ్చేసింది..

మైండ్‌ బ్లోయింగ్‌ ‘బూమ్ బూమ్’ వచ్చేసింది..

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ సినిమాలో తొలి సాంగ్  వచ్చేసింది.  ముందుగా ప్రకటించినట్టుగానే బుధవారం సాయంత్రం 6 గంటలకు  దీన్ని రిలీజ్‌ చేశారు.. ‘ బూమ్‌ బూమ్‌. భూంకపాల.. ఎస్పీవై వచ్చాడోయ్‌ ...అంటూ   మైండ్‌ బ్లోయింగ్‌ గా ఉన్న ఈ పాటకు అభిమానులు ఫుల్‌ ఫిదా.   ఈ పాటకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో అభిమానులను సర్‌ప్రైజ్ అయితే  ఇపుడు పూర్తి పాటతో  ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అటు ఈ పాటపై అప్పుడే ట్విట్టర్‌ లో సందడి మొదలైంది.  హాస్య నటుడు వెన్నెల నటుడు  అదిరిందంటూ స్పందించగా, వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌వర్మ     అభిమానులకు ఇది  బూం బూం టైం అంటూ స్పందించడం విశేషం.

ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘స్పైడర్’  సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుందని భావిస్తున్నారు. మహేష్ బాబుకు, రకుల్ ప్రీత్ సింగ్  జంటగా నటిస్తున్న సినిమాకు హేరిస్ జయరాజ్ సంగీతమందించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement