ప్రస్తుతం తన 23వ సినిమాగా తెరకెక్కుతున్న స్పైడర్ తో పాటు 24వ సినిమా భరత్ అను నేను షూటింగ్ లలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను తన 25వ సినిమాగా చేయనున్నాడు మహేష్. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుణ్ని తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆ పాత్రకు అల్లరి నరేష్ ను సంప్రదించారన్న టాక్ వినిపించగా నరేష్ కూడా ఆ వార్తలను ధృవీకరించాడు. మహేష్ బాబు సినిమా కోసం నన్ను సంప్రదించిన మాట నిజమే, అయితే ఆ సినిమాలో చేస్తున్నది లేనిది ఇంకా నిర్ణయించుకోలేదు. నా అభిప్రాయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు నరేష్. ప్రస్తుతం నరేష్ హీరోగా తెరకెక్కిన మేడ మీద అబ్బాయి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.