
ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్ లో ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ఫస్ట్ సాంగ్ ఆడియో రిలీజ్ చేసిన మహేష్, అదే పాటకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ వీడియోనూ పోస్ట్ చేశాడు. మహేష్ కూతురు సితార రెగ్యులర్ సినిమా సెట్స్ లో దర్శనమిస్తుంటుంది. తాజాగా తను కార్ లో వెళ్లూ స్పైడర్ పాటను పాడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మహేష్.
'తను ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్' అని కామెంట్ చేశాడు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి సెప్టెంబర్ 27న స్పైడర్ గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
She keeps listening to it on repeat mode :) her favourite new song 😊😊😊😊😊😊😊 pic.twitter.com/QTKu1pVVO9
— Mahesh Babu (@urstrulyMahesh) 6 August 2017