boom boom song
-
ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్ లో ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ఫస్ట్ సాంగ్ ఆడియో రిలీజ్ చేసిన మహేష్, అదే పాటకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ వీడియోనూ పోస్ట్ చేశాడు. మహేష్ కూతురు సితార రెగ్యులర్ సినిమా సెట్స్ లో దర్శనమిస్తుంటుంది. తాజాగా తను కార్ లో వెళ్లూ స్పైడర్ పాటను పాడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మహేష్. 'తను ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్' అని కామెంట్ చేశాడు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి సెప్టెంబర్ 27న స్పైడర్ గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. She keeps listening to it on repeat mode :) her favourite new song 😊😊😊😊😊😊😊 pic.twitter.com/QTKu1pVVO9 — Mahesh Babu (@urstrulyMahesh) 6 August 2017 -
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘స్పైడర్’. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ అభిమానులకు సర్ప్రైజ్గా ‘బూమ్ బూమ్’ అనే పాట టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే మొత్తం పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలిపారు. మహేష్ కు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. దాదాపు 8 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఓ సీన్ కోసం ఏకంగా 20 కోట్లకు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగడంతో మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరులో మూవీ విడుదల కానుంది. మూవీ మేకింగ్ వీడియో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.