
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘స్పైడర్’. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ అభిమానులకు సర్‌ప్రైజ్‌గా ‘బూమ్ బూమ్’ అనే పాట టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే మొత్తం పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలిపారు.
మహేష్ కు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. దాదాపు 8 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఓ సీన్ కోసం ఏకంగా 20 కోట్లకు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగడంతో మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరులో మూవీ విడుదల కానుంది. మూవీ మేకింగ్ వీడియో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.