
మహేష్ అభిమానులకు మరో షాక్..!
గత ఆరేళ్లుగా మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన లేటెస్ట్ సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న స్పైడర్ సినిమా టీజర్ కూడా ఈ నెల 31న రిలీజ్ అవుతుందని భావించారు ఫ్యాన్స్. అయితే దర్శకుడు మురుగదాస్కు మాత్రం టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశం లేదట.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను హడావిడిగా కట్ చేసి రిలీజ్ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువని భావించిన మురుగదాస్, టీజర్ రిలీజ్కు టైం తీసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఆరేళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని మురుగదాస్ బ్రేక్ చేయటం పై సూపర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకాలంగా షూటింగ్ జరుగుతున్నా టీజర్కు సరిపడా కంటెంట్ లేదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అభిమానుల కోసం టీజర్ రెడీ చేస్తారా..? లేక మరో పోస్టర్తో సరిపెడతారా..? తెలియాలంటే బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే.