స్పైడర్ టీజర్కు కొత్త డేట్..! | spyder teaser on august 9th | Sakshi
Sakshi News home page

స్పైడర్ టీజర్కు కొత్త డేట్..!

Published Thu, Jul 27 2017 12:58 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

స్పైడర్ టీజర్కు కొత్త డేట్..!

స్పైడర్ టీజర్కు కొత్త డేట్..!

బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్, త్వరలో మరో టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంత వరకు ప్రచార కార్యక్రమాల్లో మాత్రం ఆ స్పీడు కనిపించటం లేదు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ అంటూ గట్టిగా చెపుతున్నా ఇంతవరకు టీజర్ కూడా రాకపోవటంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇటీవల జూలై 20 సర్ప్రైజ్ అన్న ప్రచారం జరగటంతో టీజర్ వస్తుందని భావించారు. కానీ మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న టీజర్ రిలీజ్ అంటూ ప్రచారం జరగుతోంది. మరి ఈ సారైన మహేష్ అభిమానుల కోరిక తీరుస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement