
మహేష్ 'స్పైడర్' టీజర్ రిలీజ్ డేట్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో స్పెడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ రావటంతో త్వరలో స్పైడర్ టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లను రిలీజ్ చేయటం మహేష్ బాబుకు అలవాటు. మరోసారి అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ఈ నెల 31న స్పైడర్ టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. టీజర్ రిలీజ్ మాత్రం కన్ఫామ్ అన్న ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.