అతడు నచ్చితేనే పెళ్లి : టాప్‌ హీరోయిన్‌ | rakul preet singh open about her husband | Sakshi
Sakshi News home page

అతడు నచ్చితేనే పెళ్లి : రకుల్‌

Published Wed, Aug 16 2017 7:39 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

అతడు నచ్చితేనే పెళ్లి : టాప్‌ హీరోయిన్‌ - Sakshi

అతడు నచ్చితేనే పెళ్లి : టాప్‌ హీరోయిన్‌

సాక్షి, చెన్నై: జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి గురించి ప్రతి యువతి కలలు కంటుంది. తను ఎలా ఉండాలనేది కూడా ముందుగానే ఊహించుకుంటుంది. ఇక సినీ కథానాయికలైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అలాంటి ముందు జాగ్రత్తలే తీసుకుంటానంటోంది. కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన నిలదొక్కుకోలేకపోయినా, టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రకుల్‌ పట్టం దక్కించుకుంది. ఇక కోలీవుడ్‌నూ పాగా వేసే ప్రయత్నంలోనే ఉంది. ఇందుకోసం ప్రస్తుతం పనిచేస్తున్న రెండు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది.

మహేశ్‌బాబుతో జత కట్టిన ద్విభాషా చిత్రం స్పైడర్‌తో పాటు, తమిళంలో కార్తీకి జంటగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక త్వరలో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యతో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతోన్న ఈ అందగత్తే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయమై ఒకభేటీలో పేర్కొంటూ, మంచి అందగాడై ఉండాలని కాకుండా మంచి పొడుగైన వాడై ఉండాలనీ చెప్పింది. అంతకంటే ముఖ్యం మంచి వాడై ఉండాలట. ఒక వ్యక్తి మంచి వాడా? చెడ్డవాడా? అని చూసిన వెంటనే చెప్పలేమనీ, అందుకనే చూసి, కలిసి మెలిగి ఆ తరువాత తన ప్రవర్తన మంచి అనిపిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకే పెళ్లికి తొందర పడటం లేదనీ రకుల్‌ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement