'స్పైడర్‌' రెండో పాట విడుదల | mahesh spyder second song released monday | Sakshi
Sakshi News home page

'స్పైడర్‌' రెండో పాట విడుదల

Published Mon, Sep 4 2017 8:45 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

'స్పైడర్‌' రెండో పాట విడుదల

'స్పైడర్‌' రెండో పాట విడుదల

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు‌, ఎ.ఆర్‌. మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట 'బూమ్‌ బూమ్‌'కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో సినిమాలోని రెండవ పాటను చిత్రం యూనిట్‌ సోమవారం విడుదల చేశారు. 'ఏ పుచ్చకాయ.. పుచ్చకాయ.. నీ పెదవి తీపి నాకిచ్చుకోవే.. ఇచ్చుకోవే.. నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి.. నా గుండెకొచ్చి గుచ్చుకోవే.... హాలీ హాలీ.. ఏ హాలీ హాలీ హాలిబి..' అంటూ సాగే ఈ పాట లిరిక్‌ వీడియోను విడుదల చేశారు.

అంతేకాదు ఈ వీడియోలో పాట మేకింగ్‌ కూడా ఉంది. ఈచిత్రానికి హారీష్‌ జయరాజ్‌ సంగీతం అందించారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులతోపాటు టాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాపై వున్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement