
విడుదలకు ముందే రూ.150కోట్ల బిజినెస్!
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోత్సవం సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్పైడర్ చిత్రంతో కాస్తంత దూకుడుగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రంకోసం చివరి గీతాన్ని రోమానియాలో చిత్రీకరిస్తున్నారు. కాగా, ఇప్పుడు చిత్రవర్గాల్లో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే విడుదలకు ముందే రూ.150కోట్ల బిజినెస్ చేసేసిందట.
శాటిలైట్ హక్కులు, పంపిణీ హక్కులు కలిపి ఇప్పటికే ఈ సినిమా రూ.150కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. మొత్తానికి ఊహించినదానికంటే ఎక్కువగానే ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోందట. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశతో కూడా ఈ సినిమా పోటీ పడనుంది.