సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెట్లో ఓ స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో మహేష్ ముద్దుల కూతురు సితార సందడి చేసింది. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడే మహేష్, తరుచూ పిల్లలను సెట్కు తీసుకెళుతుంటాడు.
శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలోనూ సితార సెట్లో సందడి చేసింది. తాజాగా స్పైడర్ సెట్కు సితార వచ్చినప్పటి ఫొటోలను చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
With a most endearing guest pic.twitter.com/8NqosJYALp
— SantoshSivanASC. ISC (@santoshsivan) 8 July 2017