బిగ్ బాస్లో సూపర్ స్టార్..? | Mahesh to enter Bigg Boss show | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్లో సూపర్ స్టార్..?

Published Sun, Aug 27 2017 1:16 PM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

బిగ్ బాస్లో సూపర్ స్టార్..?

బిగ్ బాస్లో సూపర్ స్టార్..?

తెలుగు, తమిళ నాట బిగ్ బాస్ హవా కనిపిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహిరస్తున్న బిగ్ బాస్ షోలో స్టార్లు సందడి చేస్తున్నారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ హౌస్ లో దర్శనమిస్తున్నారు. ఇప్పటికే రానా, తాప్సీ, విజయ్ దేవరకొండ లాంటి వారు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. తమిళ నాట కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అయితే త్వరలో తమిళ బిగ్ బాస్ లో  సూపర్ స్టార్ మహేష్ సందడి చేయనున్నాడట.

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మహేష్, అక్కడ స్పైడర్ ను భారీగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నాడు. త్వరలో ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసేందుకు బిగ్ బాస్ హౌస్ లో సమయం గడపాలన్న నిర్ణయం తీసుకున్నారట.

తమిళ వర్షన్ కు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో షోలో పాల్గొనేందుకు మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. కోలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగా మహేష్, బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే అదే బుల్లితెరపై సంచలనమవుతుందంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement